Dial Your DM | కరీంనగర్, తెలంగాణ చౌక్ 30 : ఈ నెల 31న డయల్ యువర్ డీఎం కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కరీంనగర్-1 డిపో మేనేజర్ విజయ మాధురి కోరారు. ఈ మేరకు ఆమె శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
ఆర్టీసీ ప్రయాణికుల నుంచి ఫిర్యాదులు, సలహాలు సూచనలు తీసుకోవడానికి ఈనెల 31న డిపో-1 కార్యాలయంలో డయల్ యువర్ డీఎం కార్యక్రమాన్ని డిపో 1 పరిధిలోని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. ప్రయాణికులకు సంబంధించిన సమస్యలను సలహాలను నేరుగా 8121993780 నంబర్‌కు ఫోన్ చేసి ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంటలోపు తెలపాలని ఆమె సూచించారు.