Tahsildar arrested | పెగడపల్లి : మహిళా ఉద్యోగినిపట్ల లైంగింగక వేధింపులకు గురిచేసిన జిల్లాకు చెందిన ఓ తహసీల్దార్‌ను జగిత్యాల పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. జగిత్యాలలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు అందజేసేందుకు జిల్లా యంత్రాంగం జిల్లాలోని వివిధ మండలాల్లోని మండల స్థాయి అధికారులతో విచారణ బృందాలను ఏర్పాటు చేసింది.
అందులో భాగంగా పెగడపల్లి తహసీల్దార్ రవీందర్ టీంలో జగిత్యాల పట్టణానికి చెందిన ఓ మహిళా ఉద్యోగినిని నియమించింది. ఈ క్రమంలో ఆ ఉద్యోగినిపై సదరు తహసీల్దార్ రవీందర్ లైంగిక వేధింలుకు గురి చేశాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టి సదరు తహసీల్దారును అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.