PRTU TS | జగిత్యాల టౌన్, జనవరి 12 : జగిత్యాల లోని స్వామి వివేకానంద స్టేడియం లోని జాతీయ యువజన దినోత్సవం పురస్కరించుకుని పీఆర్టీయూటీఎస్ జగిత్యాల జిల్లా శాఖ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బోయిని పెల్లి ఆనంద్ రావు, యాల్ల అమర్నాథ్ రెడ్డి ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ స్వామి వివేకానంద స్వరం శతాబ్ధం దాటినా నేటికీ ఆ మాటలు యువకుల హృదయంలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు మహేష్, శ్రీనివాసరెడ్డి, రాజేష్, రాజగోపాల్, బొమ్మ కంటి శ్రీనివాస్, భూపాల్ రావు, రత్నాకర్ రావు, రాజేందర్ రావు, హరీష్ తదితరులు పాల్గొన్నారు.