Raghav Chadha | ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ఎంపీ రాఘవ్ చద్దా (Raghav Chadha) డెలివరీ బాయ్ అవతారమెత్తారు. బ్లింకిట్ డెలివరీ ఏజెంట్ (Blinkit delivery) డ్రెస్ ధరించి.. వస్తువులు డెలివరీ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోని రాఘవ్ చద్దా సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ‘బోర్డు రూమ్‌లకు దూరంగా.. అట్టడుగు స్థాయిలో’ అంటూ వీడియోకి క్యాప్షన్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. కాగా, డెలివరీ భాగస్వాముల కష్టాలు, తక్కువ వేతనం, సామాజిక భద్రత, పని గంటలు వంటి సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకే ఆయన డెలివరీ బాయ్‌గా మారినట్లు తెలుస్తోంది. గిగ్ వర్కర్ల సమస్యలపై గతంలోనూ ఆయన ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. వారి సమస్యలను పార్లమెంట్లో లేవనెత్తారు కూడా. ఇప్పుడు స్వయంగా డెలివరీ బాయ్ అవతారమెత్తి.. ఇంటింటికీ వెళ్లి వస్తువులను డెలివరీ చేయడం ఆసక్తికరంగా మారింది.
Away from boardrooms, at the grassroots. I lived their day.
Stay tuned! pic.twitter.com/exGBNFGD3T
— Raghav Chadha (@raghav_chadha) January 12, 2026
Also Read..
Kite festival | అహ్మదాబాద్‌లో అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ
Actor Vijay | కరూర్ తొక్కిసలాట.. సీబీఐ విచారణకు హాజరైన నటుడు విజయ్
Air India | మెడికల్ ఎమర్జెన్సీ.. విజయవాడ వస్తున్న ఎయిర్ ఇండియా విమానం జైపూర్‌లో ల్యాండింగ్