Kite festival | ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా సంక్రాంతి పండుగ సందర్భంగా గుజరాత్లో అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్ (International Kite Festival) మొదలైంది. అహ్మదాబాద్ (Ahmedabad)లోని సబర్మతి నదీతీరం (Sabarmati Riverfront)లో ఈ కైట్ ఫెస్టివల్‌ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) సోమవారం ఉదయం ప్రారంభించారు. జర్మనీ ఛాన్స్లర్ ఫ్రెడ్రిక్ మెర్జ్ (German Chancellor Friedrich Merz)తో కలిసి పతంగిని ఎగురవేశారు.
#WATCH | Prime Minister Narendra Modi and German Chancellor Friedrich Merz seen flying a kite depicting Lord Hanuman at the International Kite Festival 2026 at Sabarmati Riverfront. pic.twitter.com/ZjT8FrAP7o
— ANI (@ANI) January 12, 2026
కాగా, గుజరాత్లో ఏటా జరిగే ఈ కైట్ ఫెస్టివల్‌కు ఒక చరిత్ర ఉన్నది. అహ్మదాబాద్‌కు చెందిన మాస్టర్ కైట్ మేకర్ రసూల్భాయ్ రహీంభాయ్ 1989 జనవరి 7న 500 గాలిపటాల రైలును తయారుచేసి ఎగరవేశాడు. అప్పటి నుంచి ప్రతి ఏడాది అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నారు. గుజరాత్ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ కైట్ ఫెస్టివల్ జరుగుతున్నది. ఇక జనవరి 14 వరకు ఈ కైట్ ఫెస్టివల్ కొనసాగనుంది. దాదాపు 50 దేశాలకు చెందిన 135 మంది అంతర్జాతీయ కైట్స్ ఔత్సాహికులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. అంతేకాదు, వివిధ ప్రాంతాల్లో ప్రజలు కూడా ఈ ఫెస్టివల్లో పాల్గొని పతంగులు ఎగురవేస్తారు.
Also Read..
Actor Vijay | కరూర్ తొక్కిసలాట.. సీబీఐ విచారణకు హాజరైన నటుడు విజయ్
Air India | మెడికల్ ఎమర్జెన్సీ.. విజయవాడ వస్తున్న ఎయిర్ ఇండియా విమానం జైపూర్‌లో ల్యాండింగ్
ISRO | పీఎస్ఎల్వీ-సీ62 ప్రయోగంలో అంతరాయం : ఇస్రో చైర్మన్