Priyanka Chopra | హాలీవుడ్‌లోని అత్యంత ప్రతిష్టాత్మక అవార్డుల్లో గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ ఒకటి. ప్రస్తుతం కాలిఫోర్నియా (California)లోని బెవర్లీ హిల్స్‌లో 83వ గోల్డెన్ గ్లోబ్ అవార్డుల ప్రదానోత్సవం (Golden Globe Awards 2026) ఘనంగా జరుగుతోంది. ఈ వేడుకల్లో పలువురు హాలీవుడ్ తారలు సందడి చేశారు. బాలీవుడ్ స్టార్, గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా (Priyanka Chopra) సైతం ఈ అవార్డుల ప్రదానోత్సవం కార్యక్రమంలో మెరిశారు.
భర్త నిక్ జొనాస్ (Nick Jonas)తో కలిసి వేడుకలకు హాజరైన ప్రియాంక అందరి దృష్టిని ఆకర్షించారు. బ్లూ మెటాలిక్ గౌనులో పీసీ మెరిసిపోయారు. ఎంతో గ్లామరస్‌గా కనిపించారు. ఇక నిక్ క్లాసిక్ బ్లాక్ స్ట్రిప్డ్ టక్నేడోలో అందంగా కనిపించారు. ఈ జంట ఫొటోలకు ఫోజులిస్తూ సందడి చేసింది. అందరి దృష్టిని ఆకర్షించింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి.
Also Read..
Kite festival | అహ్మదాబాద్‌లో అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ
Actor Vijay | కరూర్ తొక్కిసలాట.. సీబీఐ విచారణకు హాజరైన నటుడు విజయ్
Air India | మెడికల్ ఎమర్జెన్సీ.. విజయవాడ వస్తున్న ఎయిర్ ఇండియా విమానం జైపూర్‌లో ల్యాండింగ్