Nora Fatehi| మూవీ లవర్స్‌కు పెద్దగా ఇంట్రడక్షన్ అవసరం లేని బాలీవుడ్ భామల్లో టాప్‌లో ఉంటుంది నోరా ఫతేహి. స్పెషల్ సాంగ్స్‌తో సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న నోరా ఫతేహి డేటింగ్ వార్తలతో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తోంది.
ఈ డ్యాన్సింగ్ క్వీన్ ఇటీవలే మొరాకోకు వెళ్లింది. ఇంతకీ ఎందుకో తెలుసా..? AFCON 2025 మ్యాచ్‌ను చూసేందుకు మొరాకోలో సందడి చేసింది. మ్యాచ్ సందర్భంగా ప్రేక్షకుల గ్యాలరీలో అక్కడి జెర్సీతోపాటు చేతిలో జెండా పట్టుకుని కెమెరాకు ఫోజులిచ్చింది. అంతేకాదు మొరాకన్ స్టార్ ఫుట్ బాలర్ అచ్రఫ్ హకిమితో కలిసి కనిపించింది.
మ్యాచ్ సందర్భంగా మొరాకో టీం విక్టరీ విజయాన్ని సాధించాలని నోరా ఫతేహి ప్రార్థించడం, మరోవైపు నోరా ఫతేహి ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌ను అచ్రఫ్ లైక్ చేయడం లాంటి విషయాలతో ఈ ఇద్దరు డేటింగ్లో ఉన్నారని అభిమానులు అంచనాకు వస్తున్నారని ఓ నేషనల్ మీడియా సంస్థ తన కథనంలో రాసుకొచ్చింది. మరి ఈ డేటింగ్ రూమర్లపై రానున్న రోజుల్లో ఏదైనా అఫీషియల్ అనౌన్స్మెంట్ వస్తుందా..? లేదంటే పుకారుగానే మిగిలిపోతుందా..? అనేది చూడాలి.
కాగా నోరో ఫతేహి గతేడాది The Tonight Showతో అమెరికన్ టెలివిజన్ డెబ్యూ ఇచ్చింది. నెక్ట్స్ ఈ బ్యూటీ హార్రర్ ఎంటర్టైనర్గా రాబోతున్న కాంచన 4లో కనిపించనుంది.