Ramagiri | రామగిరి ఏప్రిల్ 23: విద్యార్థులు ఉన్నత్త లక్షాలను సాధించి సమాజం పేరు ప్రఖ్యాతి కోసం కార్యాచరణ తో ముందుకు నడవలని ఎస్సై చంద్రకుమార్ సూచించారు. బేగంపేట ఉన్నత్త పాఠశాల లో సైబర్ నేరాలపై విద్యార్థులకు బుధవారం అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం కఠిన మైన చట్టాలు అమలులో ఉన్నాయన్నారు.
విద్యార్థులు చెడు మార్గం లో కి వెళ్లకుండా సెలవు రోజుల్లో మెబైల్ ఫోన్ల ను తక్కువ ఉపయోగించాలన్నారు. సమయం వృథా చేయకుండా గణితం, సైన్స్ వంటి పఠనం దృష్టి కేంద్రకరించి చక్కగా చదుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమం లో హెచ్ ఎం కిషన్ రావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.