Students | చిగురుమామిడి, జూలై 1 : ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్నారని తల్లిదండ్రులు విద్యార్థులను పాఠశాలకు పంపిస్తే పాఠశాలలో విద్యాబోధన సమయంలో విద్యార్థులతో పిచ్చి మొక్కలు, గడ్డిని తొలగించడం పట్ల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే చిగురుమామిడి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మంగళవారం ఉదయం 10:30 నుండి మధ్యాహ్న సమయం లంచ్ వరకు విద్యార్థులతో తరగతి విద్యాబోధన సమయంలో గడ్డిని తొలగించడం నమస్తే కంటబడింది.
రెండు రోజులుగా చిదురుమదురు వర్షాలు పడడంతో పాఠశాల ఆవరణమంతా నీటితో బురదగా మారింది. ఆ సమయంలోనే విద్యార్థులచే గడ్డిని తొలగించడం ఏంటని పలువురు తల్లిదండ్రులు ఉపాధ్యాయులను ప్రశ్నిస్తున్నారు. విద్యా బోధన కోసం విద్యార్థులను పంపిస్తే ఒక పూటంతా విద్యార్థులతో గడ్డి తొలగింపు చేయిస్తూ.. కూలీలుగా మార్చుతున్నారని తల్లిదండ్రులు ఉపాధ్యాయులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పాఠశాల ఆవరణలో పాములు, తేళ్లు ఉన్నాయని విద్యార్థులకు ఏమైనా జరిగితే ఎవరు బాధ్యులని తల్లిదండ్రులు ఉపాధ్యాయులను ప్రశ్నిస్తున్నారు. బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్న ఉపాధ్యాయుల తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Couple died | రెండు నెలల క్రితం ప్రేమ వివాహం.. సిగాచీ ఫార్మా ప్రమాదంలో దంపతులు దుర్మరణం
Chahat Bachpai | డ్రైనేజీని పరిశీలించిన మున్సిపల్ కమిషనర్ చాహత్ బాచ్‌పాయ్
NTR Vs Hrithik Roshan | వార్ 2 సెట్స్‌లో డ్యాన్స్‌తో దుమ్ము లేపబోతున్న స్టార్ హీరోలు!