korutla | టీ హబ్ ను సందర్శించిన కోరుట్ల, మెట్ పల్లి విద్యార్థులు
కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల సహకారంతో కోరుట్ల, మెట్ పల్లి విద్యార్థులు సోమవారం హైదరాబాదులోని టీ హబ్ ను సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తన సొంత ఖర్చులతో వివిధ బస్సుల్లో రెండు పట్టణాలకు చెందిన ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలకు చెందిన విద్యార్థులను హైదరాబాద్ కు తీసుకెళ్లారు.
korutla | కోరుట్ల, ఆగస్టు 25 : కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల సహకారంతో కోరుట్ల, మెట్ పల్లి విద్యార్థులు సోమవారం హైదరాబాదులోని టీ హబ్ ను సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తన సొంత ఖర్చులతో వివిధ బస్సుల్లో రెండు పట్టణాలకు చెందిన ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలకు చెందిన విద్యార్థులను హైదరాబాద్ కు తీసుకెళ్లారు. హైదరాబాద్‌లోని టీ-హబ్, టీ-వర్క్స్ సందర్శించిన విద్యార్థులతో ఎమ్మెల్యే మాట్లాడారు.
ప్రపంచ స్థాయి టెక్నాలజీ, ఇన్నోవేషన్ సెంటర్లు తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడటం రాష్ట్రానికి గర్వకారణమని తెలిపారు. టీ-హబ్, టీ-వర్క్స్ లాంటి వేదికలు విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంచి, భవిష్యత్తులో స్టార్టప్‌ల ద్వారా స్వయం ఉపాధి అవకాశాలను కల్పిస్తాయన్నారు. కోరుట్ల నియోజకవర్గ విద్యార్థులు ఈ వేదికల ద్వారా కొత్త ఆవిష్కరణలకు ముందడుగు వేయాలని ఆకాంక్షించారు.
విద్యార్థులు ఈ సందర్శనలో భాగంగా స్టార్టప్ ప్రాజెక్టులు, ఆధునిక టెక్నాలజీ విభాగాలు, ఇన్నోవేషన్ ల్యాబ్‌లు ప్రత్యక్షంగా వీక్షించారు. ఈ అనుభవం భవిష్యత్తులో వారికి ఉపాధి అవకాశాలపై అవగాహన కలగడానికి దోహదపడనుండగా, విద్యార్థులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యే వెంట కోరుట్ల నియోజకవర్గం లోని వివిధ కళాశాలకు చెందిన విద్యార్థులు, కరస్పాండెంట్లు, ప్రిన్సిపల్స్ ఉన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma | బతుకమ్మ పండుగకు కనీస ఏర్పాట్లు చేయని కాంగ్రెస్ సర్కార్.. వీడియో
Patnam Narendar Reddy | పట్టభద్రులు ఓటర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేయించుకోవాలి : మాజీ ఎమ్మెల్యే పట్నం
Maganur | షార్ట్ సర్య్కూట్‌తో ఇళ్లు దగ్ధం..పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
Chennai Metro | చెన్నైలో మెట్రో నూతన మార్గం ప్రారంభం.. ప్రధాని మోదీ, సీఎం విజయ్ తొలి ప్రయాణం..!
Violence In Manipur | మణిపూర్‌లో కొనసాగుతున్న హింస.. ఐదుగురు మృతి, పలు ఇళ్లకు నిప్పు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

