ముథోల్, ఆగస్టు 18 : నిర్మల్ జిల్లా ముథోల్ ఎమ్మార్వో కార్యాలయం ఎదుట ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ బీఆర్ఎస్ నియోజకవర్గ సమన్వయ సమితి సభ్యురాలు రమాదేవి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పేద, నిరుపేద కుటుంబాల ఆడపిల్లల వివాహాలకు ఆర్థిక భరోసా కల్పించే పథకాలను రద్దు చేయాలని చూడడం సిగ్గు చేటన్నారు.
ప్రజల తరఫున బీఆర్ఎస్ ప్రభుత్వం అండగా ఉంటూ పోరాడుతుందని స్పష్టం చేశారు. అనంతరం తహసీల్దార్ శ్రీలతకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈమె వెంట బీఆర్ఎస్ నాయకులు గంగాధర్, పోశెట్టి, అశోక్ ఉన్నారు. నిర్మల్ జిల్లా ముథోల్ తహసీల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహిస్తున్న బీఆర్ఎస్ నాయకులు.