Volleyball competitions | కోనరావుపేట, ఆగస్టు 21 : రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం వట్టిమల్ల గ్రామానికి చెందిన ఎస్ఏటీజీ అకాడమీ విద్యార్థి లాకవత్ ఆరాధ్య అత్యంత ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయికి ఎంపికైంది. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఇండియా ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఈనెల 18, 19వ తేదీల్లో జరిగిన రాష్ట్రస్థాయి అండర్-15 ఇయర్స్ వాలీబాల్ పోటీలలో ప్రతిభ చూపింది.
దీంతో జాతీయ స్థాయి క్రీడలు మహారాష్ట్రలోని పూణేలో ఈనెల 25న జరిగే క్రీడాల్లో పాల్గొనున్నట్లు తెలిపారు. ఈ క్రీడా పోటీలకు ఎంపికైన విద్యార్థిని జిల్లా వాలీబాల్ అసోసియేషన్ అధ్యక్షుడు చెన్నమనేని శ్రీ కుమార్, DYSO రాందాస్, అకాడమీ కోచ్ లు అభినందించారు.