మానకొండూర్/గంగాధర/రామడుగు, మే 5 : పలు మండలాల్లో ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. పలు గ్రామాల్లోని మామిడి తోటల్లో కాయలు నేలరాలగా, కోత దశలో ఉన్న వరి చేనులో వడ్లు రాలిపోయాయి. వడగండ్ల వానతో కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దయ్యింది. మానకొండూర్ మండలం జగ్గయ్యపల్లి, లక్ష్మీపూర్, ఈదుల గట్టెపల్లి, రంగపేట, వెల్ది, వేగురుపల్లి గ్రామాల్లోని మామి డి కాయలు రాలిపోయాయి. అలాగే ఈదురు గాలులకు విద్యుత్‌శాఖకు 3లక్షల నష్టం వాటిల్లినట్లు మానకొండూర్ ఏఈ ఆర్ సత్యనారాయణ తెలిపారు. మండల కేంద్రంతోపాటు రంగపేట, వెల్ది, వేగురుపల్లి, నాలుగు ట్రాన్స్ ఫార్మర్ల స్ట్రక్చర్స్ నేలకూలడంతో దాదాపు 2లక్షలు, మానకొండూర్ సెక్షన్ పరిధిలో 10 విద్యుత్ స్తంభాలు విరిగిపోవడంతో దాదాపు లక్ష నష్టంవాటిల్లినట్లు తెలిపారు. అలాగే గంగాధర మడంలంలోని అన్ని గ్రామాలతోపాటు రామడుగు మండలం వెలిచాల, వెదిర, దేశ్రాజ్పల్లి, షానగర్, పందికుంటపల్లి, కిష్టాపూర్, వన్నారం, కొక్కెరకుంటలో సాయంత్రం సుమారు గంటపాటు అకాల వర్షం కురిసింది. దీంతో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోయింది. మామిడి తోటల్లో కాయలు రాలిపోగా, అన్నదాతలకు తీవ్ర నష్టం వాటిల్లింది.
చిగురుమామిడి, మే 5: అకాలవర్షం, వడగండ్ల వాన బీభత్సంతో నేలరాలిన మామిడి తోటల రైతుల ను ప్రభుత్వం ఆదుకోవాలని బీఆర్ఎస్ జిల్లా నాయ కుడు కొత్త శ్రీనివాస్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ముదిమాణిక్యం, గాగిరెడ్డిపల్లి, గురుకులపల్లె, తదితర గ్రామాల్లో నేలరాలిన మామిడి తోటలు, వరి ధాన్యాన్ని బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మా మిడి అంజయ్యతో కలిసి సోమవారం ఆయన పరిశీ లించారు. ముదిమాణిక్యంలో తమకున్న పదెకరాల మామిడితోటలో కాయలు పూర్తిగా నేలరాలాయని బాధితులు జకుల రవి, జకుల మహేశ్ ఆవేదన చెం దారు. ప్రభుత్వం ఎకరానికి రూ.50వేల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇక్కడ నాయకులు జకుల రవీందర్, సన్నీల వెంకటేశం, మల్లికార్జున్ రెడ్డి, నరసింహారెడ్డి, గ్రామశాఖ అధ్యక్షుడు బోయిని రమేశ్, కలవల సంపత్‌రెడ్డి, చెప్యాల నారాయణరెడ్డి, బండి అంజిరెడ్డి, రవీందర్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, చంద్ర య్య, తదితరులు ఉన్నారు.
కార్పొరేషన్, మే 5: జిల్లాలో సోమవారం రాత్రి భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం ఎండ తీవ్రత ఎక్కువగా ఉండగా, సాయంత్రం వరకు చల్లబడ్డ వాతావరణం ఉరుములు, మెరుపులు, గాలులతో కూడిన వర్షం కురిసింది. గంగాధర, శంకరపట్నం, కరీంనగర్‌తో పాటు పలు మండలాల్లో భారీ వర్షం పడింది. ఈదురుగాలులకు పలు గ్రామాల్లో మామిడి పంట నష్టపోగా, గంగాధర మండలంలో వరిధాన్యం నష్టం కలిగింది. పలు చోట్ల ఈదురు గాలులకు చెట్ల కొమ్మలు విరిగి పడడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది.