MLA Medipalli Satyam | ఆడపిల్లలను వేధిస్తే కఠిన చర్యలు.. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
విద్యార్థులను, ఆడపిల్లలను వేధిస్తే వారు ఎంతటి వారైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని, కఠిన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం హెచ్చరించారు. గంగాధర మండలంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను వేధించిన ఘటనలో శుక్రవారం పాఠశాలను సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు.
MLA Medipalli Satyam | గంగాధర, అక్టోబర్ 31 : విద్యార్థులను, ఆడపిల్లలను వేధిస్తే వారు ఎంతటి వారైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని, కఠిన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం హెచ్చరించారు. గంగాధర మండలంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను వేధించిన ఘటనలో శుక్రవారం పాఠశాలను సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు. పాఠశాలలో ఉన్న సమస్యలను అడిగి తెలుసుకుని పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
పాఠశాలల్లో ఉన్న సమస్యల గురించి తనకు సమాచారమివ్వాలని, పెద్దన్నలా అండగా ఉండి సమస్యలను పరిష్కరిస్తానని భరోసా కల్పించారు. పాఠశాలలో విద్యార్థులను వేధించిన ఘటనలో డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్, హైదరాబాద్, కలెక్టర్ తో మాట్లాడి నిమిషాల్లోనే నిందితుడైన అటెండర్, విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన హెచ్ఎం ను సస్పెండ్ చేయించినట్లు తెలిపారు. భవిష్యత్లో ఇలాంటి సంఘటనలు జరగకుండా అధికారులు నిత్యం పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు.
విద్యార్థులపై ఇలాంటి సంఘటనలు పునరావృతం అయితే బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో సింగల్ విండో చైర్మన్ వెలిచాల తీర్మల్ రావు, సింగిల్ విండో వైస్ చైర్మన్ వేముల భాస్కర్, తహసీల్దార్ అంబటి రజిత, ఎంపీడీవో రామ్, ఎంఈఓ ప్రభాకర్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పురుమల్ల మనోహర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దుబ్బాసి బుచ్చయ్య, పడాల రాజన్న, సాగి అజయ్ రావు, బుర్గు గంగన్న, దోర్నాల శ్రీనివాస్ రెడ్డి, లక్ష్మణ్, రోమాల రమేష్, పడితపల్లి కిషన్, రాచమల్ల భాస్కర్, శ్రీనివాస్ రెడ్డి, కర్ర బాపు రెడ్డి, నగేష్, మహేష్, ఆనంద్, ముచ్చ శంకరయ్య, మంత్రి మహేందర్, గంగాధర ప్రవీణ్, మ్యాక వినోద్, వంగల శ్రీనివాస్, రాజు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండ : కాపు సీతాలక్ష్మి
IND vs WI T20I | ఉప్పల్లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
Gadwal Accident Victims | కేసీఆర్ సార్ బాగున్నారా.. హరీశ్ రావుతో గద్వాల ప్రమాద బాధితులు.. వీడియో
KTRs Meeting | కేటీఆర్ సభకు భారీగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు
Modi Cabinet | రైల్వే ఉద్యోగులకు మోదీ క్యాబినెట్ శుభవార్త.. 78 రోజుల బోనస్ ప్రకటన
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

