Social Media | పాలకుర్తి: గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న సమయంలో సోషల్ మీడియాలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు పోస్ట్ చేసిన వారిపై చట్టరీత్య చర్యలు తీసుకుంటామని బసంత్‌నగర్ ఎస్సై నూతి శ్రీధర్ హెచ్చరించారు. పాలకుర్తి మండలం ఈశాల తక్కల్లపల్లి, పాలకుర్తి గ్రామల్లో బరిలో ఉన్న అభ్యర్థులతో ఎస్సై సమావేశం ఏర్పాటుచేశారు.
ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికలు పార్టీలతో సంబంధం లేకుండా జరిగేవని ఎన్నికల అనంతరం ఒకరి మొహాలు ఒకరం చూసుకునేవాళ్లమే అని ఇలాంటి సమయంలో శత్రువులుగా మారి వైరం పెంచుకోవడం సరైంది కాదని అన్నారు. ఈ సమయంలో సోషల్ మీడియాలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు పోస్టు చేస్తే యువకులు భవిష్యత్తులో ప్రభుత్వ, ప్రవేటు సంస్థల ఉద్యోగాలకు అనర్హులని అన్నారు.