కార్పొరేషన్, జూలై 24: వివిధ రంగాల్లో రాష్ర్టాన్ని దేశంలోనే ముందంజలో ఉంచి తెలంగాణ ఫ్యూచర్ నేతగా మంత్రి కేటీఆర్ నిలుస్తున్నారని రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ కొనియాడారు. మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా కరీంనగర్‌లోని తెలంగాణ చౌక్‌లో బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ కేక్‌ను కట్ చేశా రు. అనంతరం స్వీట్లతోపాటు, పండ్లు, పూల మొక్కలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కేటీఆర్ నాయకత్వంలో పని చేయడం గర్వకారణంగా ఉందన్నారు. ఆయన పుట్టినరోజును ఒక పండుగలా జరుపుకుంటున్నట్లు చెప్పారు.
తెలంగాలణలో ఓ గొప్ప నగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దిన ఘనత కేటీఆర్‌కే దక్కుతుందన్నారు. హైదరాబాద్ కీర్తిని ప్రపంచ వ్యాప్తంగా చాటిన వ్యక్తి అని స్పష్టం చేశారు. గతంలో హైదరాబాద్ ట్రాఫిక్ ఇబ్బందులుండేవని, ఇప్పుడు పెద్ద సంఖ్యలో ైప్లెఓవర్లు నిర్మించి వాటిని పరిష్కరించారని చెప్పారు. సీఎం కేసీఆర్ ఆలోచనలను కేటీఆర్ అమలు చేస్తున్నారని తెలిపారు. బడుగు బలహీన వర్గాలు, యువతకు కోసం ఆయన నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు. ఐటీ రంగాన్ని రాష్ట్రంలో కింది స్థాయి నగరాలకు తీసుకువచ్చి విస్తరించేందుకు కృషి చేస్తున్నారని చెప్పారు. ఈ వేడుకల్లో జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ. నగర మేయర్ యాదగిరి సునీల్‌రావు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, జిల్లా గ్రంథాలయ చైర్మన్ పొన్నం అనిల్‌కుమార్‌గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ మధు, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, మాజీ ఎమ్మెల్యే కోడూరి సత్యనారాయణగౌడ్ పాల్గొన్నారు.