KARIMNAGAR | కమాన్ చౌరస్తా, ఏప్రిల్ 4 : శ్రీ రాజ రాజేశ్వర ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాల(ఆటానామస్) వాణిజ్య, వ్యాపార పరిపాలన విభాగం ఆధ్వర్యంలో విద్యార్థులు కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఐటీ టవర్ ను క్షేత్ర పర్యటనలో భాగంగా పరిశీలించారు. ఇక్కడ విద్యార్థులకు సాఫ్ట్వేర్ పరిశ్రమలో ఉద్యోగ అవకాశాలు, శిక్షణ కార్యక్రమాలు, అలాగే ఐటీ రంగంలో వ్యవస్థాపక అవకాశాల గురించి అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా TASK (Telangana Academy for Skill and Knowledge) ట్రైనర్ రమేష్ విద్యార్థులకు సాఫ్ట్వేర్ అభివృద్ధి, శిక్షణా మాడ్యూల్స్, సొంతంగా సాఫ్ట్వేర్ సంస్థను స్థాపించేందుకు అందుబాటులో ఉన్న సదుపాయాల గురించి వివరించారు. ప్రభుత్వ ప్రోత్సాహక కార్యక్రమాలు, స్టార్టప్ సంస్థలకు లభించే సహాయంపై అవగాహన కల్పించారు. వాణిజ్య విభాగ అధిపతి టి. రాజయ్య మాట్లాడుతూ విద్యార్థులను పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దటంలో ఇటువంటి పరిశ్రమ అనుభవ పర్యటనలు ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు.
ఈ పర్యటన విద్యార్థులకు ఐటీ రంగంలో ఉద్యోగ అవకాశాలు అన్వేషించడానికి, అలాగే తగిన నైపుణ్యాలను అభివృద్ధి చేసుకునేందుకు మంచి అవకాశం కల్పించిందని అన్నారు. ఈ పర్యటన విద్యార్థులకు పరిశ్రమ అనుభవాన్ని అందించడం, అలాగే వారి భవిష్యత్తు కెరీర్ అవకాశాలకు మార్గదర్శనం చేయడం లక్ష్యంగా నిర్వహించినట్ల చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎం.మల్లా రెడ్డి, ఆర్ రామకృష్ణ, ఎం. శ్రీనివాస్ రెడ్డి, హర్జోత్ కౌర్, బుర్ల నరేష్ , కె అర్జున్, ఎం. శిరీష , టి. అరవింద్ , బి. నర్మదా , ఎ. మల్లేశం , బి. రాజు ,పూర్ణ చందర్ రాజు, ఎస్. ఇలయ్య , కె. నాగరాజు, ఎం. శిరిషా, టి. విద్య , వి. అభిలాష్, విద్యార్థులు పాల్గొన్నారు.