కరీంనగర్ కార్పొరేషన్, ఫిబ్రవరి 23 : బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం రిజర్వేషన్లను పెంచాలంటే రాజ్యాంగ సవరణ చేయాలని, దానిపై బీజేపీ స్పష్టత ఇవ్వాలని రాష్ట్ర మంత్రి శ్రీధర్‌బాబు(Sridhar Babu) డిమాండ్ చేశారు. ఆదివారం కరీంనగర్‌లోని డీసీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తాము బడుగుల అభ్యున్నతి కోసం కులగణన సర్వే చేశామని, దీనిని అసెంబ్లీలో తీర్మానం చేసి చట్టబద్ధత కల్పించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. దీని కోసం కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగ సవరణకు ముందుకు వస్తుందా? అని నిలదీశారు.
బీసీల కోసం కృషి చేస్తున్న కాంగ్రెస్‌ను అనేక సాకులు చెప్పి బద్నాం చేసేందుకు బీజేపీ కుట్రలు పన్నుతుం దని ఆరోపించారు. 317 జీవోపై ఇప్పుడు మాట్లాడుతున్న బీజేపీ గత పదేళ్లలో ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నిం చారు. కాంగ్రెస్ హయాంలోనే అనేక సంక్షేమ పథకాలు చేపట్టామన్నారు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని కోరారు. ఈ సమావేశంలో ప్రభుత్వ విప్ లక్ష్మణ్‌కుమార్, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం, తదితరులు పాల్గొన్నారు.