Sultanabad | సుల్తానాబాద్ రూరల్, మే 26 : పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గట్టపల్లి గ్రామంలోనీ నాగలింగేశ్వర స్వామి దేవాలయం రెండవ వార్షికోత్సవం వేడుకలను సోమవారం అంగరంగ వైభవంగా, కన్నుల పండువగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితులు , ప్రధాన అర్చకులు మల్ల వఝుల రత్నాకర్ శర్మ ఆధ్వర్యంలో పలువురు పండితులు మహా రుద్రాభిషేకం తదితర కార్యక్రమాలను నిర్వహించారు.
స్వామి కళ్యాణ వేడుకలు పేద మంత్రోత్సవాల మధ్య వైభవంగా నిర్వహించారు. మాజీ సర్పంచ్, ఆలయ సేవకులు దన్ నాయక్, అమల దామోదర్ రావు దంపతులు, కుటుంబ సభ్యులు, పుర ప్రముఖులు , గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పూజల్లో పాల్గొన్నారు. స్వామి వారి తీర్థప్రసాదాలు వితరణ చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమం లో విద్యుత్ శాఖ ఎస్సీ మాధవరావు, సర్కిల్ ఇన్స్పెక్టర్ సుబ్బారెడ్డి, పురం ప్రేమ్ చందర్ రావు, ప్రమోద్, డాక్టర్ విజయకుమార్, సంపత్ కుమార్, కల్వకుంట్ల శ్రావణ్, కోట లక్ష్మారెడ్డి, ముత్యాల కరుణాకర్, రమేష్, రాధా కిషన్, చంద్రయ్య, మాజీ సర్పంచ్ నల్లవెల్లి రాజమౌళి, ఆరే సతీష్ తో పాటు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు.