Sri Krishna Janmashtami | కమాన్చౌరస్తా, ఆగస్టు 22: శ్రీ కృష్ణ జన్మాష్టమి గోకులాష్టమి పండగలను పురస్కరించుకుని త్రైత సిద్ధాంతం ప్రబోధ సేవా సమితి ఇందూ జ్ఞాన వేదిక కరీంనగర్ కు చెందిన సభ్యుల ఆధ్వర్యంలో ఆచార్య ప్రబోధానంద యోగిశ్వరులు రచించిన త్రైత సిద్ధాంత భగవద్గీత శ్లోకాల పఠనం జరిపారు. అమెరికాలోని మేరీల్యాండ్ రాష్ట్రం ఎల్లికాట్లో ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమం మూడు రోజుల పాటు జరుగగా, ఉదయం సాయంత్రం స్థానిక భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై ప్రత్యేకంగా జరిగిన పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరుల స్వామి రాసిన త్రైత సిద్ధాంత భగవద్గీత, అనుబంధ గ్రంథాలను అక్కడి భక్తులకు ఇచ్చి జ్ఞాన పరిచయం చేశారు.