Mallapur | మల్లాపూర్, జూలై 13: మండల కేంద్రానికి చెందిన రజక సంఘ సభ్యుల ఆధ్వర్యంలో మడేలేశ్వర స్వామికి ఆదివారం బోనాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే సంఘ సభ్యులు అంతా కలిసి సహంపక్తి భోజనాలు చేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు ఎలాల జలపతి రెడ్డి, మాజీ ఎంపీపీ నల్ల రాజన్న, నాయకులు బద్దం నర్సారెడ్డి, కోటగిరి నందు గౌడ్, గంగారెడ్డి, రజక సంఘ సభ్యులు పాల్గొన్నారు.