MLA CH Vijayaramana Rao | పెద్దపల్లి రూరల్, నవంబర్ 22 : గ్రామీణప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక కృషి చేస్తున్నామని, గ్రామాల్లో అర్హులైన వారందరికి ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకునే అవకాశం కల్పిస్తామని, అట్టి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని పెద్దపల్లి ఎమ్మెల్యే సీహెచ్ విజయరమణారావు అన్నారు. పెద్దపల్లి మండలంలోని కొత్తపల్లిలో రూ. 45 లక్షలతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజల సంక్షేమంకోసం అనేక కార్యక్రమాలను చేపడుతున్నామని, వాటిని వినియోగించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీవో జనగామ శరత్ బాబు, మాజీ సర్పంచులు శిలారపు సత్యం, ఎలబోతారం శంకర్, నాయకులు కలబోయిన మహేందర్, షుకూర్, చెరుకు విద్యాసాగర్ రెడ్డి, కలవేన రాజయ్య, కలవేన సంపత్, బాలసాని లెనిన్ గౌడ్, ఎంచర్ల తిరుమలేష్, దబ్బెట అనిల్, కనుకుంట్ల సత్తయ్య, పెర్క స్వామి, కనుకుంట్ల సదానందం, జోగు రాజయ్య, ఈరవేన రాజేందర్, పంచాయతీ కార్యదర్శి దేవరనేని సురేందర్ రావు, పలువురు నాయకులు పాల్గొన్నారు.