Special bus service | హుజురాబాద్ టౌన్, జూన్ 20 : యాదగిరిగుట్ట, స్వర్ణ గిరి, వరంగల్‌లోని భద్రకాళి ఆలయాల తీర్థయాత్రకు ఈనెల 27న హుజురాబాద్ ఆర్టీసీ డిపో నుండి ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సు సర్వీసును నడపనున్నట్లు హుజూరాబాద్ డిపో మేనేజర్ రవీంద్రనాథ్ తెలిపారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
ఈ నెల 27న హుజురాబాద్ డిపో నుండి ఉదయం 4గంటలకు బయలుదేరి సాయంత్రం 5 గంటలకు హుజురాబాద్ కి చేరుతుందని తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని హుజురాబాద్ డీఎం రవీంద్రనాథ్ కోరారు. ఈ సర్వీస్‌కు పెద్దలకు రూ.1000, పిల్లలకు రూ.600 గా నిర్ణయించినట్లు పేర్కొన్నారు. తాగునీరు, అల్పాహారం సౌకర్యం అందిస్తున్నట్టు డీఎం తెలిపారు. అడ్వాన్స్ బుకింగ్ కోసం 9959225924, 9704833971, 9247159535, 9441404841 నంబర్లను సంప్రదించాలని కోరారు.