సిరిసిల్ల తెలంగాణ చౌక్, జూన్ 5: ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సిరిసిల్ల పోలీస్‌శాఖ సైక్లింగ్ చేపట్టింది. ప్రజల్లో అవగాహన కల్పించేందుకు జిల్లా కేంద్రంలోని రగుడు చౌరస్తా నుంచి బతుకమ్మ ఘాట్ దాకా సైకిల్ ర్యాలీ తీసింది. అందులో ఎస్పీ అఖిల్ మహాజన్ పాల్గొన్నారు. అనంతరం బతుకమ్మ ఘాట్ వద్ద మొక్క నాటి నీరు పోసి మాట్లాడారు.
పర్యావణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని, మొక్కల పెంపకాన్ని సామాజిక బాధ్యతగా తీసుకోవాలని సూచించారు. అప్పుడే భావితరాలకు కాలుష్యరహిత సమాజాన్ని అందించగలుగుతామని చెప్పారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ చంద్రయ డీఎస్పీ నాగేంద్రచారి, సీఐలు రఘుపతి, శ్రీనివాస్‌గౌడ్, వీరప్రతాప్, శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, ఆర్ఐలు యాదగిరి, రమేశ్, ఎస్ఐలు ఉన్నారు.