సైదాపూర్, సెప్టెంబర్ 2 : కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టి రైతులకు సాగునీరు అందించిన కేసీఆర్‌ను అప్రతిష్టపాలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కుట్రలు పన్నుతున్నదని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సోమారపు రాజయ్య అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును సీబీఐకి అప్పగించడాన్ని నిరిసిస్తూ మండల కేంద్రంలోని కొత్తబస్టాంద్ వద్ద బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా రాజయ్య మాట్లాడుతూ. సీఎం రేవంత్ రెడ్డి కుట్రలకు తెలంగాణ బిడ్డలు భయపడరన్నారు.
అనంతరం మండల కేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహానికి కాళేశ్వరం జలాలతో అభిషేకం నిర్వహించి తహసిల్దార్ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు. మండలంలో యూరియా కొరత లేకుండా చూడాలని, రైతులందరికి సరిపడా యూరియా అందించాలని ఏఓకు వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో వెన్నంపల్లి సింగిల్‌విండో చైర్మన్ బిల్ల వెంకటరెడ్డి, మాజీ ఎంపీపీ సారబుడ్ల ప్రభాకర్‌రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ రావుల శ్రీధర్‌రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి చెలిమెల రాజేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.