Sarangapur | సారంగాపూర్, డిసెంబర్ 24: సారంగాపూర్ మండల సర్పంచుల ఫోరం నూతన కార్యవర్గాన్ని బుధవారం ఎన్నుకున్నారు. మండలంలోని ఆయా గ్రామాల సర్పంచులు సమావేశమై మండల సర్పంచుల ఫోరాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా అర్పల్లి గ్రామ సర్పంచ్ సొల్లు సురేందర్, ప్రధాన కార్యదర్శిగా ధర్మనాయక్ తండా సర్పంచ్ భుక్య సంతోష్, ఉపాధ్యాక్షులుగా లక్ష్మీదేవిపల్లి, రంగపేట, పోచంపేట సర్పంచులు మ్యాకల శేఖర్, ఏదుల శేఖర్, రెంటం జగదీష్, కార్యదర్శిగా ఒడ్డెరకాలనీ సర్పంచ్ పల్లపు మాదవి, కార్యవర్ల సభ్యులుగా కొత్తురి పుష్పనాధ్, మైనేని ప్రమీల, భుక్య భారతి, గడ్డం గంగారాంలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కార్యవర్గాన్ని మాజీ జడ్పీటీసీ మెడిపల్లి మనోహర్ రెడ్డి, నాయకులు జోగినిపెల్లి సుధాకర్ రావు, గుర్రాల రాజేంధర్ రెడ్డి, తోడేటి శేఖర్ గౌడ్, మల్లారెడ్డి, మల్లేశం, తదితరులు అభినందించారు.