GodavariKhani | కోల్ సిటీ , మే 10: పాక్ ఉగ్రవాదులను తుదముట్టించే లక్ష్యంగా చేపట్టిన ఆపరేషన్ సిందూర్ విజయవంతం కావాలని, భారత జవానులకు భరతమాత విజయం అందించాలంటూ వీర సైనికులకు రామగుండం రిక్రియేషన్ క్లబ్ (ఆర్ఆర్సీ) మద్దతు ప్రకటించింది. గోదావరిఖనిలో భారీ జాతీయ పతాకంతో శనివారం సంఘీభావ ర్యాలీ చేపట్టింది. స్థానిక నగర పాలక సంస్థ కార్యాలయం టీ జంక్షన్ వద్ద నుంచి మొదలైన ఈ ర్యాలీలో క్లబ్ సభ్యులు జయహో భారత్ అంటూ నినాదాలతో ర్యాలీ చౌరస్తా వరకు కొనసాగింది.
దారి పొడవునా దేశభక్తి పరిఢవిల్లింది. ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షులు బల్మూరి అమరేందర్ మాట్లాడుతూ ఆపరేషన్ సిందూర్ విజయవంతం కావాలని, పాక్ ఉగ్రవాదులు అణచివేసేందుకు విరోచిత పోరాటం చేస్తున్న మన భారత జవానులకు దేశ ప్రజల ఆత్మవిశ్వాసమే ఊపిరై మరింత మనోధైర్యం అందించాలని కోరారు. ప్రపంచ చిత్రపటంలో పాక్ కనిపించకుండా పోవాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి మంతెన శ్రీనివాస్, బుచ్చిరెడ్డి, కోశాధికారి అశోక్ రావు, ఆర్గనైజింగ్ సెక్రెటరీ జీవన్ బాబు నిట్టూరి, తిరుపతి రెడ్డి, రాజిరెడ్డి, మల్లారెడ్డి, రాజేంద్రకుమార్, రామస్వామి, సుధాకర్, ఓదెలు, శంతన్ కుమార్, శ్రీనివాస్, సత్యనారాయణ , కొత్త శ్రీనివాస్, పొలాడి శ్రీనివాస రావు, కృష్ణ, సంతోష్ రావు, రాము, సదయ్య, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.