Godavarikhani | గోదావరిఖని : ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు సిట్ నోటీస్ జారీ చేయడం రాజ్యాంగ విరుద్ధమని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ తీవ్రంగా విమర్శించారు. గోదావరిఖని చౌరస్తాలో ఆదివారం బిఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నా నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో అధికారంలోనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అరాచక అనిచివేత ధోరణితో ముందుకు సాగుతున్నాడని పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్రం సాధించిన కేసీఆర్ పై కక్షగట్టి ఫోన్ టాపింగ్ కేసులో నోటీసులు జారీ చేయడం సరైంది కాద ఫోన్ టాపింగ్ వ్యవహారమే పనికిరానిదని కేవలం ప్రతిపక్ష పార్టీగా ఉన్న బీఆర్ఎస్ ను అణిచివేయడానికి ఇప్పటికే కేటీఆర్, హరీష్ రావుకు సిట్ నోటీసులు జా రి చేసి విచారణ చేశారని ఏమి సాధించలేని పరిస్థితుల్లో కేసీఆర్ కు సిట్ నోటీసులు జారీ చేసి విచారణ చేస్తున్నారని, ఇది పూర్తిగా అనైతిక చర్య అని ఆయన ఆరోపించారు.
రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే ఈ వ్యవహారం కొనసాగుతుందని విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళన భాగంగా గోదావరిఖనిలో చౌరస్తాలో ధర్నా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఈ మాజీ ఎమ్మెల్యే చందర్ మాట్లాడుతూ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి తెలంగాణ ప్రధాత కేసీఆర్ ను కావాలని ఇరాకాటంలో పెట్టడానికి ఇలాంటి చర్యలకు రేవంత్ రెడ్డి కోరుకుంటున్నాడని ఆయన ఆరోపించారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కౌశిక్ హరి, మూల విజయ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.