సిరిసిల్ల తెలంగాణ చౌక్, జూన్ 13: సిరిసిల్ల జిల్లా కేంద్రంలో గురువారం పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించారు. దీనిని కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎస్పీ అఖిల్ మహాజన్‌తో కలిసి ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ప్రారంభించారు.
నిరుద్యోగ నివారణ ఫౌండేషన్ సహకారంతో నిర్వహించిన ఈ జాబ్ మేళాకు 60కి పైగా కంపెనీలు రాగా, పెద్ద సంఖ్యలో యువతీయువకులు తరలివచ్చా రు. ఇందులో 1746 మందికి ఉద్యోగావకాశాలు కల్పించారు. అర్హతలు బట్టి నియామక పత్రాలు అందించారు.