గంగాధర,డిసెంబర్ 2 : కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలో స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించడానికి మండల ప్రజలు సహకరించాలని ఎస్ఐ వంశీకృష్ణ మంగళవారం ఓ ప్రకటనలో కోరారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పౌరులు నడుచుకో వాలన్నారు. రాజకీయ కారణాల వల్ల వాగ్వాదాలు, గొడవలు, గుంపుల మధ్య ఘర్షణలు చేయవద్దని సూచించారు.
డబ్బు, మద్యం, బహుమతులు తీసుకోవడం నేరమని, ఇలాంటి చర్యలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తప్పుడు వార్తలు, పుకార్లను సోషల్ మీడియా, వాట్సాప్ గ్రూపుల్లో ప్రచారం చేయవద్దని, ఎన్నికల ప్రవర్తనా నియమావళిని కచ్చితంగా పాటించాలని సూచించారు. అనుమానాస్పదంగా కనిపించే అక్రమ కార్యకలాపాలు, బెదిరింపులు, అక్రమ రవాణా, బహుమతుల పంపిణీ వంటివి వాటిని గురించి పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.