చిగురుమామిడి, జూలై 16: చిగురుమామిడి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ గా శశిధర్ శర్మ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. శశిధర్ శర్మ సైదాపూర్ మండల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో భౌతిక శాస్త్రం అధ్యాపకుడిగా పనిచేస్తూ పదోన్నతి పై చిగురుమామిడి ప్రిన్సిపల్ గా బాధ్యతలు స్వీకరించారు.
వీరు బాధ్యతలు స్వీకరించడం పట్ల కళాశాల అధ్యాపక బృందం హర్షం వ్యక్తం చేస్తూ ప్రిన్సిపాల్ కు శుభాకాంక్షలు తెలిపారు.