అన్నదాత పరిస్థితి దయనీయంగా మారింది. ఇటీవల మొంథా తుపాను అతలాకుతలం చేసింది. చేతికొచ్చే దశలో పంటలకు తీవ్ర నష్టం కలిగించింది. కొనుగోలు కేంద్రాలు, కల్లాల్లో ధాన్యాన్ని తడపడమే కాదు.. కోతలకు సిద్ధంగా ఉన్న పొలాలను నిండా ముంచింది. చాలాచోట్ల పొలాలు ఇంకా నీళ్లలోనే ఉండగా, నేలవాలిన వరిని కోయలేని దుస్థితి ఉన్నది.
కండ్ల ముందే దెబ్బతిన్న పంటలను చూసి అన్నదాతలు కన్నీరు పెడుతున్నారు. ప్రతికూల పరిస్థితుల్లో రెక్కలు ముక్కలు చేసుకొని పండించిన పంట చేతికిరాక గుండెలు బాదుకుంటున్నారు. ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు.