Vemulawada | వేములవాడ, ఏప్రిల్ 17: వేములవాడ సబ్ రిజిస్టార్ కార్యాలయంలో సేవలు నిలిచిపోయాయి. వేములవాడలో రిజిస్ట్రేషన్ సేవల కోసం ఉదయమే వచ్చిన ప్రజలు సేవల కోసం పడి కాపులు కాస్తున్నారు. ఉదయం 10:30కే వచ్చిన ప్రజలకు సర్వర్ పని చేయడం లేదని అధికారులు తెలపడంతో ఎండలో నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
సబ్ రిజిస్టార్ భాస్కర్ ను వివరణ కోరగా సర్వర్ లో సాంకేతిక లోపం తలెత్తడంతో సేవలు నిలిచిపోయాయని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా కూడా సేవలు నిలిచిపోయాయని పేర్కొన్నారు. వేములవాడ సబ్ రిజిస్టార్ కార్యాలయంలో శుక్రవారం రిజిస్ట్రేషన్ కోసం 47 మంది ప్లాట్ బుక్ చేసుకోగా ప్రస్తుతం వారు కార్యాలయం వద్ద పడికాపులు కాస్తున్నారు.