Heart Attack | కాల్వ శ్రీరాంపూర్, జనవరి 18 : కాల్వశ్రీరాంపూర్ మండలంలోని ఉషన్నపల్లి గ్రామానికి చెందిన సీనియర్ పాత్రికేయుడు బాలే శివప్రసాద్ గుండెపోటుతో మృతి చెందాడు. మండల కేంద్రంలో శనివారం అస్వస్థతకు గురికావడంతో స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స చేయించారు.
అనంతరం కుటుంబ సభ్యులు మెరుగైన వైద్యం కోసం కరీంనగర్ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స చేస్తుండగా పరిస్థితి విషమించి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. బాలే శివప్రసాద్ మృతి వార్త తెలుసుకున్న పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు, మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, జర్నలిస్టులు, మాజీ ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు శివప్రసాద్ భౌతిక దేహాన్ని సందర్శించి కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపం వ్యక్తం చేశారు.