Karimnagar Corporation | కరీంనగర్ కార్పొరేషన్, ఏప్రిల్ 8 : కరీంనగర్ నగర పాలక సంస్థ సూపరింటెండెంట్ ఇంజినీర్ రాజ్ కుమార్ ఇవాళ్టి నుంచి నెలరోజులపాటు సెలవుల్లో వెళ్లారు. అయితే ఈయన సెలవులో వెళ్లడానికి అధికార వర్గాల నుంచి వచ్చిన ఒత్తిళ్లే కారణమా అంటే అవుననే సమాధానమే వస్తుంది. పలువురు అధికార ప్రతినిధులు స్థానిక ప్రతినిధులు అధికారం వర్గాల నుంచి వచ్చిన ఒత్తిళ్ల కారణంగా సెలవుల్లో వెళ్లాల్సి వచ్చిందని తెలుస్తుంది. ఇంజినీరింగ్ విభాగంలోని నీటి నిర్వహణ విభాగంలో పనిచేస్తున్న ఓ కింది స్థాయి ఉద్యోగిపై ఇటీవల అక్రమ ఆరోపణలు వచ్చాయి.
వీటిపై స్పందించిన నగరపాలక ఉన్నతాధికారులు ఎస్ఈ సంబంధిత ఉద్యోగిపై చర్యలు తీసుకుంటూ అక్కడి నుండి బదిలీ చేశారు. కాగా ఈ విషయంలోనే అధికార ఒత్తిళ్లతో ఉన్నతాధికారులు మళ్లీ ఆ ఉద్యోగికి యధా స్థానం నుండి పోస్టింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఈ విషయంలో ఉన్నతాధికారులు, ఎస్ఈకి మధ్య విభేదాలు నెలకొనడంతో సెలవు పెట్టి వెళ్లినట్లు తెలుస్తుంది. కేవలం ఒక కిందిస్థాయి ఉద్యోగి ఒత్తిళ్ల కారణంగా ఉన్నతాధికారులే భయపడి వెళ్లిపోవడంపై నగరపాలక సంస్థలో జోరుగా చర్చలు సాగుతున్నాయి.
అలాగే నగరపాలక సంస్థలోని ఇంజినీరింగ్ విభాగంలోని పలువురు ఉన్నతాధికారులు, ఇతర విభాగాల్లోని అధికారులు సైతం ఇక్కడి నుంచి మరోచోటికి బదిలీ చేసుకోవడం లేదా డిప్యూటేషన్ అయినా వేయించుకుని వెళ్లిపోయేందుకు తీవ్ర ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా నగరపాలక సంస్థలో అధికారుల మధ్య అంతర్గత విభేదాలతో పలు వివాదాలు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే.
కొందరు కీలక అధికారుల తీరు వల్ల తాము ఇక్కడ పనిచేసే పరిస్థితులు కనిపించక పోవడం వల్లే బదిలీల కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆయా అధికారులు తమ అనుయాయుల వద్ద పేర్కొనడం గమనార్హం. ఇప్పటికే కరీంనగర్ నగరపాలక సంస్థకు వచ్చేందుకు ఎక్కువమంది అధికారులు ఆసక్తి చూపించారన్న అపవాదు ఉంది. ఎప్పుడు వచ్చినా వారు సైతం అధికార ఒత్తిళ్లతో వెళ్లిపోవడం మున్సిపాలిటీ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతుంది. నగరపాలక సంస్థలో రాజకీయ అధికార ఒత్తిడి వివాదాలు ఎక్కువగా ఉంటాయన్న గుసగుసలు మున్సిపాలిటీ వర్గాల్లో సాగుతున్నాయి.
Shadnagar | రెండు గంటలైనా రాని 108 అంబులెన్స్.. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
Kunal Kamra | కమెడియన్ కునాల్ కమ్రాకు బాంబే హైకోర్టులో ఊరట
KTR | ఏడాది పాటు బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ ఉత్సవాలు చేస్తాం : కేటీఆర్