Dharmapuri | కొత్తూరు పాఠశాలలను తనిఖీ చేసిన సర్పంచ్.. పాలకవర్గ సభ్యులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన సంగీత
ధర్మారం మండలం కొత్తూరు గ్రామ యువ మహిళా సర్పంచ్ భూక్య సంగీత ఆంజనేయులు, గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు సంయుక్తంగా గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాల, అంగన్వాడి కేంద్రాన్ని గురువారం తనిఖీ చేశారు.
Dharmapuri | ధర్మారం, ఆగస్టు 27 : ధర్మారం మండలం కొత్తూరు గ్రామ యువ మహిళా సర్పంచ్ భూక్య సంగీత ఆంజనేయులు, గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు సంయుక్తంగా గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాల, అంగన్వాడి కేంద్రాన్ని గురువారం తనిఖీ చేశారు. ప్రభుత్వ పాఠశాల బలోపేతం చేయడం, విద్యార్థుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి లో భాగంగా వారు తనిఖీలు నిర్వహించారు. విద్యార్థులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. పాఠశాలలో విద్యా బోధన, విద్యార్థుల హాజరు వివరాలను ఉపాధ్యాయులను సర్పంచ్ సంగీత ఆంజనేయులు అడిగి తెలుసుకున్నారు.
విద్యార్థులకు ప్రణాళిక ద్వారా ప్రకారం నాణ్యమైన విద్యాబోధన చేసి పాఠశాలలకు ఉన్నత శ్రేణి ఖ్యాతిని నిలబెట్టాలని ఈ సందర్భంగా సర్పంచ్ ఉపాధ్యాయులకు సూచించారు. అనంతరం సర్పంచ్ తో పాటు పాలకవర్గ విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసి భోజనం నాణ్యతను పరిశీలించారు. పాఠశాలల్లో సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని వాటి పరిష్కారం కోసం కృషి చేస్తానని, అభివృద్ధికి అవసరమైన చర్యలు చేపడతామని సర్పంచ్ సంగీత తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ సామల నాగభూషణం, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

