Dharmaram | ధర్మారం, జనవరి 28 : పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో సమ్మక్క-సారలమ్మ జాతర ఉత్సవాలు బుధవారం నుంచి ఘనంగా ప్రారంభమయ్యాయి. జాతర కమిటీ ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు.
మండల పరిధిలోని ధర్మారం, నంది మేడారం, బోట్ల వనపర్తి, దొంగతుర్తి, చామనపల్లి, కొత్తూరు, కటికనపల్లి, నర్సింగాపూర్, ఎర్రగుంటపల్లి గ్రామాలలో సమ్మక్క-సారలమ్మ జాతర ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. తొలి రోజు మేడారంలోని కోయ పూజారులు ఆయా జాతర ఉత్సవాలకు వచ్చి సారలమ్మను గద్దెల వద్దకు తీసుకువచ్చి ప్రతిష్టించారు. దీంతో ఆయా గ్రామాలలో ఉత్సవాలు మొదలయ్యాయి. గురువారం సమ్మక్క గద్దెకు చేరుకోనుంది.