Sanitation work | ధర్మారం, జనవరి 13 : ధర్మారం మండలం రామయ్యపల్లి గ్రామంలో పారిశుధ్య అభివృద్ధి పనులను సోమవారం గ్రామ సర్పంచ్ మూల మంగ మల్లేశం గౌడ్ ప్రారంభించారు. గ్రామంలోని రోడ్డుకు ఇరువైపుల పిచ్చి మొక్కలను బ్లేడ్ ట్రాక్టర్ తో చదును చేయించారు. గ్రామ యువకుల విజ్ఞప్తి మేరకు గ్రామంలో ప్రభుత్వ పాఠశాల క్రీడా మైదానం చదును చేయించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మూల మంగ మల్లేశం గౌడ్ మాట్లాడుతూ గ్రామ అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తామన్నారు. సమస్యల పరిష్కారం కోసం నిరంతరంగా కృషి చేస్తానని ఆమె పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ భూతగడ్డ గట్టమ్మ, వార్డు సభ్యులు బాలయ్య, సుజాత రవి, శ్రీకాంత్, గాయత్రి సత్తయ్య, లక్ష్మీ ఐలయ్య, మధుకర్, శ్రీనివాస్, జీపీ సెక్రెటరీ ప్రకాష్, యూత్ నాయకులు భూతగడ్డ సంతోష్ తదితరులు పాల్గొన్నారు.