Tangallapalli | సిరిసిల్ల రూరల్, మే 2: తంగళ్లపల్లి మండలంలోని అన్ని గ్రామాలకు స్థానిక అవసరాల కోసం తంగళ్లపల్లి నుంచి గతం లో మాదిరిగా యథావిధిగా ఇసుకను సర ఫరా చేయాలని బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గజ భీంకార్ రాజన్న ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట స్థానిక అవసరాలకు ఇసుక సరఫరా చేయాలంటూ శుక్రవారం ఆందోళన చేశారు. అనంతరం లిఖితపూర్వకంగా తహసీల్దార్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రాజన్న మాట్లాడుతూ.. గత కొంతకాలంగా తంగళ్లపల్లి మండలంలోని అన్ని గ్రామాలకు ఇసుకసరపరలేక నిర్మాణాలను నిలిచిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. చాలామంది మానేరు బాగా ఉన్నప్పటికీ ఇసుక సరఫరా లేకపోవడంతో నిర్మాణం నిలిచిపోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఒక్కటి అవసరాలకు సిరిసిల్ల నుంచి ఇసుక సరఫరా చేయడంతో ఒక్క ఇసుక ట్రిప్పుకు రూ.3వేల నుంచి రూ.4 వేల వరకు చెల్లించాల్సి వస్తుందని, సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో తంగళ్లపల్లిలోని మానేరు వాగు నుంచి ఇసుకను సరపర చేశామని, ట్రిప్పుకు డీడీ కేవలం రూ.180 కే ఇచ్చి, సామాన్యులకు స్థానిక అవసరాలకు ఇసుక అందించామని గుర్తు చేశారు. కానీ ఇప్పటి ప్రభుత్వం ఇందుకు భిన్నంగా డీడీ చార్జీలు పెంచి రూ.480 కి డీడీ చెల్లిస్తనే సరఫరా చేస్తున్నారని ఆరోపించారు. అయినప్పటికీ స్థానికంగా పుష్కరించు లేకపోవడంతో నిర్మాణాలు నిలిచిపోయాయని, సిరిసిల్ల నుంచి ఇసుక సరఫరా కావడంతో అధిక ధరలు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇప్పటికైనా వెంటనే స్థానిక అవసరాలకు తంగళ్లపల్లి నుంచి ఇసుక సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.
అదేవిధంగా డీడీ చార్జీలు కూడా తగ్గించాలని కోరారు. వారానికి రెండు సార్లు స్థానిక అవసరాలకు సరఫరా చేయాలని కోరారు. భవన నిర్మాణం రంగంపై ఆధారపడిన వారిని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. స్థానిక అవసరాలు కాకుండా అక్రమంగా ఇతర ప్రాంతాలకు సరఫరా చేస్తే తప్పకుండా కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. వెంటనే తంగళ్లపల్లిలో ఇసుకరీచ్ ప్రారంభించి, గృహ నిర్మాణదారులను ఆదుకోవాలని కోరారు. అవసరమైతే ఇసుకను స్థానిక అవసరాలకు ఉచితంగా సరఫరా చేయాలనీ విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ పడి గెల మానస, సింగిల్ విండో చైర్మన్ బండి దేవదాస్ గౌడ్, వైస్ చైర్మన్ వెంకట రమణారెడ్డి, మాజీ జడ్పీటీసీ కోడి అంతయ్య, మాట్ల మధు, వలకొండ వేణుగోపాలరావు, పడిగెల రాజు, ఏసీ రెడ్డి రాంరెడ్డి, ఉమ్మారెడ్డి సత్యనారాయణ రెడ్డి, పబ్బతి విజయేందర్ రెడ్డి, పూర్మని లక్ష్మారెడ్డి, గుండు ప్రేమ్ కుమార్, కొయ్యా డ రమేష్, బండి జగన్ , నవీన్ రెడ్డి, అమర్ రావు, అనిల్,కిష్టారెడ్డి, బుస్స లింగం, జగత్, జీవన్, దొంతినేని చంద్రారావు, బాబు, పర్శరాము లు,రవీందర్ రావు , కం దు కూరి రామ గౌడ్, మల్లారపు నరేష్, నక్క కొమురయ్య తదితరులు ఉన్నారు.