Telangana Praja Natya Mandali | చిగురుమామిడి, జూన్ 1 : తెలంగాణ ప్రజానాట్యమండలి రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా చిగురుమామిడి మండలం రేకొండ గ్రామానికి చెందిన ప్రజానాట్యమండలి కళాకారుడు దుడ్డేల సమ్మయ్య ఎన్నికయ్యారు. ఇటీవల హైదరాబాద్లో 26వ రాష్ట్ర తెలంగాణ ప్రజానాట్యమండలి సదస్సు నిర్వహించగా ఎన్నుకున్నారు. సమ్మయ్య కరీంనగర్ జిల్లా ప్రజానాట్యమండలి ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు.
తన ఎన్నికకు సహకరించిన సీపీఐ జాతీయ నేత చాడ వెంకటరెడ్డి, జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ కు రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా ఎన్నికైన సమ్మయ్య కృతజ్ఞతలు తెలిపారు. ఆయన ఎన్నిక పట్ల సింగిల్ విండో డైరెక్టర్ చాడ శ్రీధర్ రెడ్డి, బోయిని అశోక్, బోయిని పటేల్, మండల కొమురయ్య, విలాసాగరం అంజయ్య, తమ్మిశెట్టి రవీందర్, నీల వెంకన్న హర్షం వ్యక్తం చేశారు.