chigurumamidi | చిగురుమామిడి, నవంబర్ 1 : తుఫాన్ ప్రభావంతో నష్టపోయిన వారి పంటలను బిఆర్ఎస్ నాయకులు శనివారం పరిశీలించారు. మండలంలోని బొమ్మనపల్లి, ఉల్లంపల్లి గ్రామాల్లో వర్షానికి దెబ్బతిన్న పంటలను పరిశీలించి రైతులను ఓదార్చారు. బిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా కల్పించారు. ప్రభుత్వం తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవాలని, ఎకరానికి 30 వేల రూపాయలు పరిహారాన్ని మంజూరు చేయాలని వారు డిమాండ్ చేశారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల పట్ల వివక్ష చూపుతున్నారని అన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాలను సైతం అధికారులు పట్టించుకోవడంలేదని క్షేత్రస్థాయిలో పంటలను అధికారులు పరిశీలించడం లేదని అన్నారు. పంటలు పరిశీలించిన వారిలో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు మామిడి అంజయ్య, ఆర్బిఎస్ మండల మాజీ అధ్యక్షుడు తిరుపతి, మాజీ ఎంపిటిసిలు రమేష్, మల్లేశం నాయకులు శ్రీనివాస్, నాగరాజు, వెంకటయ్య, సదానందం, సమ్మయ్య, బాలయ్య, చంద్రయ్య, తిరుపతి, మల్లికార్జున్, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.