పల్లె లేదు.. పట్టణం లేదు. నాటి సమైక్య పాలనలో ఎక్కడ చూసినా అంతులేని ‘దారి’ద్య్రం. ఇరుకు రోడ్లు, ఆపై అడుగులోతు గుంతలు.. ఏదైనా అత్యవసరం వచ్చి వెళ్తే ప్రయాణం నరకప్రాయం. పొరుగున ఉన్న గ్రామానికి పోవాలన్నా మట్టిరోడ్లపై అరగంటపాటు ప్రయాణించాల్సిన దుస్థితి. ముందు ఓ వాహనం వస్తే మరో బండి ముందుకు వెళ్లలేని పరిస్థితి. ఇలా దశాబ్దాలపాటు పూర్తి వివక్షకు గురైన దారులకు స్వరాష్ట్రంలో రాజయోగం పట్టింది. మెరుగైన ప్రయాణంతోనే అభివృద్ధి సాధ్యమని భావించిన బీఆర్ఎస్ సర్కారు, కోట్లాది నిధులతో రోడ్లను అభివృద్ధి చేసింది. దీంతో రోడ్లన్నీ అద్దల్లా మారాగా, ప్రయాణం సాఫీగా సాగుతున్నది. గతంలో గంటకు 30 కిలోమీటర్లు దాటని వాహనాల వేగం, ఇప్పుడు 60 నుంచి 80కి పెరిగింది. దీంతో సమయం, ఇంధనం ఆదా అవుతుండగా, వాహనదారుల్లో హర్షం వ్యక్తమవుతున్నది.
కరీంనగర్, మే 17 (నమస్తే తెలంగాణ): సమై క్య పాలనలో ఎక్కడికెళ్లినా గతుకుల రోడ్లే దర్శనమిచ్చేవి..ప్రైవేట్ వాహనాలు, బస్సుల్లో వెళ్లిన వారికి చుక్కలు కనిపించేవి. కానీ స్వరాష్ట్రంలో తె లంగాణ ప్రభుత్వం రహదారుల అభివృద్ధిపై ప్ర త్యేక దృష్టిపెట్టింది. ఒక్క కరీంనగర్ జిల్లాలోనే ఆర్అండ్బీ, పంచాయతీ రాజ్ రోడ్ల విస్తరణకు వం దల కోట్లు ఖర్చు చేసింది. గతంలో గంటకు వాహనాల సగటు వేగం కేవలం 30-40 కిలో మీటర్లు మాత్రమే ఉండేది. రోడ్లు అభివృద్ధి చెందిన తర్వా త ఇపుడు గంటకు 60-80 కిలో మీటర్లకు పెరిగింది. కార్లు, మోటర్ సైకిళ్ల, ఆటోల కనీస వేగం రెట్టింపైంది. సామాన్యుల వాహనమైన ఆర్టీసీ బ స్సుల వేగం కూడా ఇపుడు కనీసం 60 కిలో మీటర్లకు చేరింది. జిల్లా కేంద్రం నుంచి మండల కేం ద్రాలకు సింగిల్ రోడ్లు, మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రానికి డబుల్ రోడ్లు నిర్మించారు. దీంతో బస్సుల్లో ప్రయాణం చేసే వారు కూడా స్వల్ప వ్యవధిలో జిల్లా కేంద్రానికి చేరుకుంటున్నారు. ఇంతకుముందు కరీంనగర్ నుంచి హుజూరా బాద్‌కు వెళ్లాలంటే గంటా 10 నిమిషాలు పట్టేది. ఇపుడు 50 నిమిషాల్లో చేరుకుంటున్నారు. గంట వ్యవధిలో జమ్మికుంటకు చేరుకుంటున్నారు. హు స్నాబాద్‌కు చేరుకోవాలంటే గతంలో గంటా 30 నిమిషాలు పట్టేది. ఇపుడు గంటలోనే గమ్యం చే రుతున్నారు. ఇటు వేములవాడ, సిరిసిల్ల మార్గం లో, జగిత్యాల, మెట్పల్లి మార్గంలో, పెద్దపల్లి, గోదావరిఖని మార్గంలో ప్రయాణించే బస్సుల వేగం కూడా గంటకు సగటున 60 కిలో మీటర్ల వేగంతో వెళ్తున్నాయి. కార్లలో ప్రయాణించే వాళ్లు స్పీడ్ లిమిట్‌ను అనుసరించి వెళ్లినా 80కి తక్కువ కాకుండా వాహనాల వేగం పెరిగింది.
50 నిమిషాల్లో వేములవాడ
రాష్ట్రం రాకముందు రోడ్లు మంచిగా ఉండేవి కావు. వేములవాడ, సిరిసిల్ల పోవాల్నంటే గంటన్నర పట్టేది. తెలంగాణ గవర్నమెంట్ వచ్చినంక రోడ్లు చాన అభివృద్ధి అయినయ్. స్టేజీలు పెరిగినా ఆర్డినరీ బస్సును 50 నిమిషాల్లో వేములవాడలో ఉంచుతున్నం. సిరిసిల్ల వెళ్లాలంటే మరో 15 నిమిషాలు పడుతున్నది. మాకు హాల్టింగ్ సమయం కలిసి వస్తున్నది. సిరిసిల్ల నుంచి కామారెడ్డికి వెళ్లాలంటే గతంలో రెండు గంటలు పట్టేది. ఇపుడు గంటా 45 నిమిషాల్లో చేరుతున్నం. డ్రైవింగ్ కూడా కష్టమనిపిస్త లేదు.
– యూ శ్రీనివాస్, ఆర్టీసీ డ్రైవర్ (కరీంనగర్-1 డిపో)
స్టాప్‌లు పెరిగినా గంటలో టచ్ చేస్తున్నం
హుస్నాబాద్ రూట్లో రోడ్లు మంచిగ డెవలప్ చేశారు. గతంలో ఎక్కువ స్టేజీలు ఉండేటివి కాదు. రోడ్లు డెవలప్ అయిన తర్వాత స్టేజీలు కూడా పెంచారు. అయినా 40 కిలో మీటర్ల ఉన్న హుస్నాబాద్‌ను గంటలో చేరుకుంటున్నం. కారులో వెళ్తే 30-40 నిమిషాల్లో వెళ్లొచ్చు. బైక్‌పై వెళ్లినా 40 నిమిషాల్లో టచ్ చేయచ్చు. రోడ్లు అభివృద్ధి చేయడం వల్లనే ఇంతగనం వేగం పెరిగింది. ట్రాఫిక్ రూల్స్ పాటించుకుంట వెళ్లినా అనుకున్న సమయానికి గమ్యం చేరుకుంటున్నం.
– జీ శేఖర్, ఆర్టీసీ డ్రైవర్ (హుస్నాబాద్ డిపో)
స్పీడ్ లిమిట్ పెంచాలె
ఇపుడు మన జిల్లాల ఎటు వెళ్లినా కండ్లు మూసుకుని వంద మీద కొట్టచ్చు. కేసీఆర్ సార్ రోడ్లు మంచిగ చేసిండు. మునుపటికి ఇప్పటికి వేహికిల్స్ పెరిగి ట్రాఫిక్ ఇబ్బందులు వస్తున్నాయి. అట్లకాకుంట.. ఎక్కడికక్కడ స్పీడ్ లిమిట్స్ ఉన్నయ్. మన జిల్లాల 80 దాటి వాహనం నడపరాదు. దాటితే ఫైన్లు వేస్తున్నరు. రోడ్లు ఉన్నతీరుకు వంద స్పీడ్ తక్కువే. కానీ స్పీడ్ లిమిట్ కూడా పెంచాలె. ఫెనాల్టీ వేస్తున్నరని డ్రైవర్లు భయపడి స్పీడ్‌గా వెళ్లడం లేదు.
– కత్తి జైపాల్, టాక్సీ డ్రైవర్ (కరీంనగర్)