road accident |ఎల్లారెడ్డిపేట, మార్చి 27 : ఎల్లారెడ్డిపేట మండలం రాజన్నపేట కృష్ణనాయక్ తండాకు చెందిన శివరాత్రి లింగం కుమారుడు సాయి కృష్ణ (17), తల్లి విజయ కలసి గురువారం కొండగట్టుకు వెళ్లి దైవ దర్శనం చేసుకుని తిరుగు ప్రయాణంలో ఆటోలో వస్తున్నారు. కాగా అందులో పరిమితికి మించి ప్రయాణికులు ఉండడంతో సాయికృష్ణ మరొకరితో కలిసి టాప్ పైన కూర్చున్నారు.
ఘాట్ రోడ్డు లో స్పీడ్ బ్రేకర్ ఉండడంతో ఆటో సడన్ బ్రేక్ వేయడంతో టాప్ పై నుండి ఆటో ముందు ఇద్దరు పడిపోయారు. కాగా అదే ఆటో సాయి కృష్ణ పైనుండి వెళ్లడంతో సాయి కృష్ణ అక్కడికక్కడే మృతి చెందాడు. కళ్ళ ముందే కన్న కొడుకు విగత జీవిగా మారడం తో తల్లి దండ్రుల రోదనలు మిన్నంటాయి.