Road Accident | కోరుట్ల, జనవరి 12: కోరుట్ల పట్టణంలో ని జాతీయ రహదారిపై సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ప్రయాణికులు తృటిలో తప్పించుకున్నారు..స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం. పట్టణ శివారు మెట్ పల్లి రోడ్డు లోని జిఎస్ గార్డెన్ సమీపంలో జాతీయ రహదారిపై ముందు వెళ్తున్న ఆర్టీసీ బస్సును వెనుక నుంచి వస్తున్న కారు బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో బస్సు వెనుక భాగంలోకి కారు చొచ్చుకుపోయి బోనెట్ ఇంజన్ ఇరుక్కు పోయి, కారు ముందు భాగం పూర్తిగా దెబ్బతింది.
జాతీయ రహదారిపై ఇటీవల రహదారిపై స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయడంతో ఆర్టీసీ డ్రైవర్ బస్సు వేగాన్ని నియంత్రించడంతో వెనుక నుంచి వేగంగా వస్తున్న కారు డ్రైవర్ ప్రమాదవశాత్తు బస్సును ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. కాగా మెట్పల్లి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు కోరుట్లకు వైపు వస్తుండగా నిజామాబాద్ నుంచి కారులో ఐదుగురు కుటుంబ సభ్యులు సమ్మక్క సారలమ్మ జాతరకు వెళుతున్నారు. ఈ ప్రమాదంలో ప్రయాణికులు సురక్షితంగా బయటపడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.