
Road accident | సుల్తానాబాద్ రూరల్, నవంబర్ 5 : పెద్దపెల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని నీరుకుల్ల పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలయ్యాయి. స్థానికుల కథనం ప్రకారం.. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం వేగురుపల్లి గ్రామానికి చెందిన ఇద్దరు అయ్యప్ప మాలదారుణ స్వాములు బత్తిని వీరస్వామి, నందికొండ రెడ్డిలు గూడెం గుట్టకు వెళ్లారు.
అక్కడి నుండి ద్విచక్ర వాహనంపై బుధవారం తిరుగు ప్రయాణంలో నీరుకుల బ్రిడ్జి సమీపంలో వారి వాహనాన్ని కారు ఢీకొట్టింది. ఈ సంఘటనలో ఇద్దరికీ కాళ్లకు, శరీర భాగంలో తీవ్రగాయాలు కాగా గమనించిన స్థానికులు వెంటనే 108 వాహనంలో సుల్తానాబాద్ ప్రభుత్వ తరలించారు. మెరుగైన వైద్యం కోసం కరీంనగర్ తరలించారు. విషయం తెలుసుకున్న సుల్తానాబాద్ ఎస్సై శ్రావణ్ కుమార్ సంఘటన స్థలానికి చేరుకొని ప్రమాదానికి గల కారణాలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు.