Rice smuggling | మంథని రూరల్, నవంబర్ 20 : రైస్ మిల్లులో బియ్యం గోల్ మాల్ అయిన సంఘటనలో నిందితులను అరెస్టు చేసినట్లు మంథని సీఐ రాజు పేర్కొన్నారు. మంథని పట్టణం పోలీస్ స్టేషన్ లో గురువారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మంథని సీఐ రాజు మాట్లాడారు. మంథని మండలం గద్దలపల్లి గ్రామంలో శ్రీ లక్ష్మీ ప్రసన్న ఇండస్ట్రీస్ మిల్లులో అవకతవకలు జరిగినట్లు పేర్కొన్నారు.
ఖరీఫ్ సీజన్ కు ప్రభుత్వం వారు మిల్లుకు 38, 489 క్వింటాళ్ల వడ్లను అందిస్తే సివిల్ సప్లై కార్పొరేషన్ వారికి 25, 680.43 క్వింటాళ్ల బియ్యం అప్పగించాల్సి ఉందని తెలిపారు. కాగా సివిల్ సప్లై వారికి బియ్యం ఇవ్వకుండా సుమారు రూ.12 కోట్ల వరకు మోసం జరిగిందని వివరించారు. సివిల్ సప్లై కార్పొరేషన్ జిల్లా మేనేజర్ శ్రీకాంత్ ఫిర్యాదు మేరకు గతంలో శ్రీనివాసును అరెస్టు చేశామని, ఇప్పుడు ప్రసాదరావును అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచినట్లు మంథని సీఐ రాజు వివరించారు.