చొప్పదండి, ఆగస్టు 3: రైతు బాంధవుడు సీఎం కేసీఆర్ అని జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ ఏనుగు రవీందర్ రెడ్డి, ఎంపీపీ చిలుక రవీందర్, మున్సిపల్ చైర్పర్సన్ గుర్రం నీరజ, సింగిల్ విండో చైర్మన్ వెల్మ మల్లారెడ్డి, మినుపాల తిరుపతిరావు, మారెట్ కమిటీ చైర్మన్ గడ్డం చుకారెడ్డి పేరొన్నారు. లక్షలోపు పంట రుణం మాఫీ చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేస్తూ బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు వెల్మ శ్రీనివాస్ రెడ్డి, పట్టణాధ్యక్షుడు లోక రాజేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలోని తెలంగాణ చౌరస్తా వద్ద పార్టీ నాయకులు, రైతులు సంబురాలు చేసుకున్నారు. సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి, స్వీట్లు తినిపించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం అనేక పథకాలను ప్రవేశపెడుతున్నదని, అందులో భాగంగానే లక్షలోపు రుణ మాఫీ చేయడం హర్షణీయమన్నారు. రైతులు మాట్లాడుతూ, ఇచ్చిన మాట నిలబెట్టుకున్న నాయకుడు కేసీఆర్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పెద్ది శంకర్, కౌన్సిలర్లు కొత్తూరి మహేశ్, మాడూరి శ్రీనివాస్, మార్కెట్ కమిటీ వైస్‌చైర్మన్ చీకట్ల రాజశేఖర్, కొండగట్టు దేవస్థానం బోర్డు డైరెక్టర్ గొల్లపల్లి శ్రావణ్‌కుమార్, కో-ఆప్షన్ సభ్యుడు పాషా, మాజీ జడ్పీటీసీ ఇప్పనపల్లి సాంబయ్య, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఆరెల్లి చంద్రశేఖర్‌గౌడ్, మాజీ వైస్ చైర్మన్ కొత్త గంగారెడ్డి, నాయకులు నలుమాచు రామకృష్ణ, మాచర్ల వినయ్, దండె కృష్ణ, బత్తిని సంపత్, మహేశుని మల్లేశం, జహీర్, గాండ్ల లక్ష్మణ్, మావురం మహేశ్, చోటు, యువరాజ్, కుమార్, రైతులు పాల్గొన్నారు.

రామడుగు, ఆగస్టు 3: మండల కేంద్రంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గంట్ల జితేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో రైతులు ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. వెలిచాల తెలంగాణ తల్లి విగ్రహం కూడలిలో సర్పంచ్ వీర్ల సరోజన-ప్రభాకర్‌రావు ఆధ్వర్యంలో రైతులు కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. గ్రామానికి చెందిన ఓ రైతు సీఎం కేసీఆర్ చిత్రపటాన్ని తన భుజాలపై ఉంచుకొని అభిమానం చూపుతూ ఆనందంతో గంతులు వేశాడు. గోపాల్రావుపేట బస్టాండ్ కూడలిలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ కలిగేటి కవిత-లక్ష్మణ్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గంట్ల జితేందర్‌రెడ్డి మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ రైతులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారని కొనియాడారు. రామడుగులో సర్పంచ్ పంజాల ప్రమీల-జగన్మోహన్గౌడ్, కొండగట్టు దేవస్థానం బోర్డు డైరెక్టర్ బండపెల్లి యాదగిరి, గోపాల్రావుపేట ఏఎంసీ చైర్మన్ మామిడి తిరుపతి, మాజీ ఎంపీపీ మార్కొండ కిష్టారెడ్డి, ఆర్బీఎస్ జిల్లా సభ్యుడు వీర్ల సంజీవరావు,

ఆర్బీఎస్ మండల కో-ఆర్డినేటర్ జూపాక కరుణాకర్, ఏఎంసీ వైస్ చైర్మన్ చాడ ప్రభాకర్‌రెడ్డి, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు ఎడవెల్లి నరేందర్‌రెడ్డి, ఏఎంసీ డైరెక్టర్లు శనిగరపు అనిల్‌కుమార్, కొడిమ్యాల రాజేశం, కొలిపాక మల్లేశం, గడ్డం మోహన్‌రావు, నాయకులు నాగుల రాజశేఖర్‌గౌడ్, శనిగరపు అర్జున్, వంచ మహేందర్‌రెడ్డి, లంక మల్లేశం, మొయిజ్, కిరణ్, రవీందర్, బీ సురేశ్, పూడూరి మల్లేశం, సైండ్ల కరుణాకర్, చాడ శేఖర్‌రెడ్డి, బండారి చరణ్, మన్నె దర్శన్రావు, పెసరి రాజమౌళి, గంట్ల వెంకటరెడ్డి, తడగొండ నర్సింబాబు, బత్తిని మునయ్య, జూపాక మునీందర్, తడగొండ హన్మంతు, కొడుముంజ లేఖరాజు, కనుకం కనకయ్య, సీపెల్లి పోచమల్లు, పెంటి శంకర్, వెలిచాలలో ఆర్బీఎస్ జిల్లా సభ్యుడు వీర్ల సంజీవరావు, ఉప సర్పంచ్ పూదరి వెంకటేశ్, మాజీ సర్పంచ్ వీర్ల రవీందరరావు, ఆర్బీఎస్ గ్రామ కోఆర్డినేటర్ పెరమండ్ల శ్రీనివాస్‌గౌడ్, వార్డు సభ్యులు వంగ వెంకటరమణ, మీస వెంకటేశ్, బీఆర్ఎస్ యువజన విభాగం మండలాధ్యక్షుడు ఆరపెల్లి ప్రశాంత్, నాయకులు ఐలయ్య, కుమార్, అజయ్, రమణ, నర్సయ్య, సంజీవ్, ప్రశాంత్, అనిల్, సిరిసిల్ల సంజీవ్, వెంకటేశ్, రాజు, రాజు, యూసఫ్, గోపాల్రావుపేటలో బీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు వేల్పుల హరికృష్ణ, మండల కోఆప్షన్ సభ్యుడు ఎండీ రజబ్అలీ, నాయకులు సుద్దాల మల్లేశం, ముదుగంటి రాజిరెడ్డి, ఎడవెల్లి పాపిరెడ్డి, పురాణం రమేశ్, పైండ్ల తిరుపతి, రేణికుంట బసంతం, బుర్ర గంగయ్య, కోయల్‌కార్ శ్రీనివాస్, ఏగోలపు కొమురయ్య, కర్ర శ్యాంసుందర్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, తిరుపతి, తదితరులు పాల్గొన్నారు.

గంగాధర, ఆగస్టు 3: మండలంలోని మధురానగర్ చౌరస్తాలో బీఆర్ఎస్ మండల నాయకుల ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కాసారం, తాడిజెర్రి, రంగరావుపల్లి, ఉప్పరమల్యాల, కాచిరెడ్డిపల్లి, ర్యాలపల్లి గ్రామాల్లో బీఆర్ఎస్ నాయకులు, రైతులు సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి, స్వీట్లు పంచిపెట్టారు. మధురానగర్‌లో బీఆర్ఎస్ నాయకులు, రైతులు పొలాల్లో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్లు దూలం బాలాగౌడ్, వెలిచాల తిర్మల్‌రావు, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మేచినేని నవీన్‌రావు, మార్కెట్ కమిటీ చైర్మన్ లోకిని ఎల్లయ్య, సింగిల్ విండో వైస్ చైర్మన్ వేముల భాస్కర్, ఆత్మ చైర్మన్ తూం మల్లారెడ్డి, సర్పంచులు మడ్లపెల్లి గంగాధర్, వేముల దామోదర్, కంకణాల విజేందర్‌రెడ్డి, రాసూరి మల్లేశం, మాల చంద్రయ్య, జోగు లక్ష్మీరాజం, ఎంపీటీసీ ద్యావ మధుసూదన్‌రెడ్డి, అట్ల రాజిరెడ్డి, కో-ఆప్షన్ సభ్యుడు ఇస్మాయిల్, నాయకులు వేముల అంజి, రామిడి సురేందర్, వడ్లూరి ఆదిమల్లు, తోట మహిపాల్, బొల్లాడి శ్రీనివాస్‌రెడ్డి, ముద్దం నగేశ్, తాళ్ల సురేశ్, అబ్బాస్, పెంచాల చందు, బండారి శ్రీనివాస్, గంగాధర శ్రీకాంత్, ఉప్పు ప్రశాంత్, వేణు తదితరులు పాల్గొన్నారు.
ముకరంపుర, ఆగస్టు 3: కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో ఏఎంసీ చైర్మన్ రెడ్డవేని మధు, డైరెక్టర్లు సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఏఎంసీ చైర్మన్ రెడ్డవేని మధు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల కష్టాలు తెలిసిన గొప్ప వ్యక్తి కావడం వల్లే అన్నదాతలపై రుణ భారం లేకుండా మాఫీ చేశారని కొనియాడారు. రూ.19వేల కోట్ల నిధుల విడుదలకు ఆదేశాలు జారీ చేయడం పట్ల సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఏఎంసీ వైస్ చైర్మన్ ఉప్పు రాజశేఖర్, డైరెక్టర్లు పబ్బతి రంగారెడ్డి, మహ్మద్ మహముద్పాషా, కుమార్ పాల్గొన్నారు.

కరీంనగర్ రూరల్, ఆగస్టు 3: సీఎం కేసీఆర్ రూ. లక్షలోపు పంట రుణ మాఫీ చేసి రైతులకు మరోసారి ఆర్థికంగా భరోసా కల్పించారని ఎంపీపీ తిప్పర్తి లక్ష్మయ్య పేర్కొన్నారు. కరీంనగర్ రూరల్ మండలం దుర్శేడ్‌లోని గోపాల్పూర్ క్రాసింగ్ వద్ద ఆయన గోపాల్పూర్, దుర్శేడ్ గ్రామాల రైతులు, బీఆర్ఎస్ నాయకులతో కలిసి సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ లక్ష్మయ్య మాట్లాడుతూ, అన్నదాతల సంక్షేమానికి సీఎం కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారని కొనియాడారు. 29.61 లక్షల రైతులకు లబ్ధి చేసే విధంగా రూ. 19 వేల కోట్ల పంట రుణాలు మాఫీ చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని తెలిపారు. ఆర్బీఎస్ మండల కన్వీనర్ కాశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ, తెలంగాణ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు, కరీంనగర్ సింగిల్ విండో చైర్మన్ పెండ్యాల శ్యాంసుందర్‌రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ రైతాంగానికి సీఎం కేసీఆర్ ఆపద్బాంధవుడిగా నిలిచాడని తెలిపారు. ఈ కార్యక్రమంలో దుర్శేడ్ సింగిల్ విండో చైర్మన్ గోనే నర్సయ్య, మాజీ చైర్మన్ మంద రాజమల్లు, వైస్ ఎంపీపీ వేల్పుల నారాయణ, బీఆర్ఎస్ నాయకులు రాజేశ్వర్‌రావు, ఊరడి మల్లారెడ్డి, మండల కో-ఆప్షన్ సభ్యుడు సర్వర్‌పాషా, ఆర్బీఎస్ మండల కన్వీనర్ మంద తిరుపతి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ కుమార్, బీఆర్ఎస్ యూత్ మండలాధ్యక్షుడు శ్రీనివాస్, మెడిద రాజిరెడ్డి, ఆరె శ్రీకాంత్, శ్రీరామోజు తిరుపతి, ప్రసాద్, నారాయణ, కాశిపాక సంపత్, ఆదిరెడ్డి, రాజిరెడ్డి, మహేశ్, కూర శ్యాంసుందర్‌రెడ్డి, బుర్ర తిరుపతి గౌడ్, దుర్శేడ్, ఇరుకుల్ల, గోపాల్పూర్ రైతులు తదితరులు పాల్గొన్నారు.