Chigurumamidi | చిగురుమామిడి, జూన్ 27 : చిగురుమామిడి మండలంలోని నవాబ్ పేట్ గ్రామానికి చెందిన రిటైర్డ్ తహసీల్దార్ దేవసాని గణపతి రెడ్డి ఇటీవల మృతి చెందాడు. కాగా వారి కుటుంబానికి కరీంనగర్ రెవెన్యూ రిక్రియేషన్ క్లబ్ జిల్లా అధ్యక్షుడు మోసం అంజయ్య అసోసియేటెడ్ అధ్యక్షుడు తాటిపల్లి ఈశ్వర్ తో పాటు రెవెన్యూ అధికారులు గణపతి రెడ్డి సతీమణి సుశీలకు రూ.పదివేల చెక్కును వారి కుమారులు దేవసాని శ్రీనివాస్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి సమక్షంలో శనివారం అందజేశారు. గణపతి రెడ్డి మృతి పట్ల వారు సంతాపం వ్యక్తం చేశారు. వారితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. వారి కుటుంబానికి అండగా ఉంటామని వారు భరోసా ఇచ్చారు.