TG-20 cricket | గన్నేరువరం, జూన్8 : తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించనున్న టీజీ-20 క్రికెట్ టోర్నమెంటుకు గన్నేరువరం మండలంలోని పారువెల్ల గ్రామానికి చెందిన ఎల్లాల విద్యానంద రెడ్డి ఎంపికయ్యాడు.ఈ టోర్నమెంట్ లో ఖమ్మం జట్టు తరఫున ఆడేందుకు వేలంలో రూ1.7లక్షలకు విద్యానంద రెడ్డిని ఖమ్మం మేనేజ్మెంట్ దక్కించుకుంది.
రాష్ట్ర స్థాయిలో క్రికెట్ జట్టుకు ఎంపిక కావడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. జీవితంలో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఆయనను పలువురు అభినందించారు.