Stop Illegal Sand | చిగురుమామిడి, జులై 14: మండలంలోని నవాబ్ పేట్ గ్రామంలో ఇసుక అక్రమంగా రవాణా జరగకుండా అరికట్టాలని గ్రామస్తులు కోరారు. మండల రెవెన్యూ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్ స్వరూపరాణికి సోమవారం వినతి పత్రం అందజేశారు.
కరీంనగర్ జిల్లాలో చివరి సరిహద్దు గ్రామంగా ఉండడంతో గ్రామానికి చెందిన వాగులోని ఇసుక అక్రమంగా తరలిస్తున్నారని, ఇసుక అక్రమ రవాణా జరగకుండా ప్రత్యేక దృష్టి పెట్టి చర్యలు తీసుకోవాలని వినతి పత్రంలో పేర్కొన్నారు. ఇసుక రవాణాతో భూగర్భ జలాలు అడుగంటి నీటి కొరత ఏర్పడే అవకాశం ఉందని వాపోయారు. వినతి పత్రం అందజేసిన వారిలో గ్రామస్తులు అజయ్ కుమార్, తిరుపతి, వంశీకృష్ణ, హరీష్, ఐలేష్ తదితరులు ఉన్నారు.